గురువారం 01 అక్టోబర్ 2020
National - Aug 13, 2020 , 08:24:00

నంబి నారాయణ్‌కు 1.30 కోట్లు అదనపు పరిహారం

నంబి నారాయణ్‌కు 1.30 కోట్లు  అదనపు పరిహారం

తిరువనంతపురం: రెండున్నర దశాబ్దం కిందటి గూఢచర్యం కేసులో నిందారోపణలు ఎదుర్కొన్న ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణ్‌కు మంగళవారం కేరళ ప్రభుత్వం రూ. 1.30 కోట్ల అదనపు నష్ట పరిహారాన్ని చెల్లించింది. రాకెట్‌ సాంకేతికతకు సంబంధించిన స్వదేశీ సమాచారాన్ని శత్రుదేశాలకు అందజేసి గూఢచర్యానికి పాల్పడ్డారని 1994లో నారాయణ్‌పై కేసు నమోదైంది. ఆ తర్వాత ఈ కేసులో ఆయన నిరపరాధి అని తేలింది. అకారణంగా తనను వేధించారని పేర్కొంటూ నారాయణ్‌ కోర్టులో కేసు వేశారు. దీంతో న్యాయస్థానం ఆదేశాలతో ఇప్పటికే ప్రభుత్వం రెండు దఫాల్లో రూ. 60 లక్షలను ఆయనకు చెల్లించింది.logo