శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
National - Aug 11, 2020 , 20:54:31

ఢిల్లీలో కొత్తగా 1,257 కరోనా పాజిటివ్‌ కేసులు

ఢిల్లీలో కొత్తగా 1,257 కరోనా పాజిటివ్‌ కేసులు

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం కొత్తగా 1,257 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. అలాగే వైరస్‌ నుంచి మరో 727 మంది రోగులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. గత 24 గంటల్లో మరో 8 మంది మహమ్మారి కారణంగా మృతి చెందగా, మొత్తం మృతుల సంఖ్య 4,139కి పెరిగిందని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. ఢిల్లీలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,47,391కి చేరగా.. 1,32,384 మంది కోలుకున్నారు. ఢిల్లీ ఇవాళ 5,356 ఆర్టీపీసీఆర్‌, సీబీనాట్‌, ట్రూనాట్‌ పరీక్షలు చేయగా, 14,084 ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలు చేసింది. మొత్తం 2,23,845కి చేరాయి. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 22,68,675 కొవిడ్‌-19 కేసులు నిర్ధారణ కాగా, వీటిలో 15,83,489 మంది కోలుకోగా, 6,39,929 క్రియాశీల కేసులున్నాయి.logo