శుక్రవారం 14 ఆగస్టు 2020
National - Jul 25, 2020 , 18:14:35

ఢిల్లీలో తగ్గిన కరోనా కేసులు

ఢిల్లీలో   తగ్గిన కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. గత కొన్ని రోజుల నుంచి  2వేల   కన్నా తక్కువగానే  కేసులు నమోదవుతున్నాయి.  గడచిన 24 గంటల్లో ఢిల్లీలో కొత్తగా 1,142 మందికి కరోనా పాజిటివ్‌గా  నిర్ధారణ అయింది. తాజాగా మరో  2,137 మంది కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు.  ఇవాళ ఒక్కరోజే 29 మంది చనిపోయారు. 

ప్రస్తుతం ఢిల్లీలో 12,657 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు 1,13,068 మంది కోలుకోగా..3,806 మంది  మరణించారు. ఢిల్లీలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,29,531కు చేరింది. ఢిల్లీలో కరోనా తగ్గుముఖం పట్టినప్పటికీ దక్షిణాది రాష్ట్రాల్లో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటం ఆందోళన 

కలిగిస్తోంది. 


logo