సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 22, 2020 , 12:40:19

ఒడిషాలో కొత్తగా 1,078 కరోనా కేసులు

ఒడిషాలో కొత్తగా 1,078 కరోనా కేసులు

భువనేశ్వర్‌ : గడిచిన 24 గంటల్లో ఒడిషాలో కొత్తగా 1,078 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. మరో ఐదుగురు మృతి చెందారని, వీరు మధుమేహంతో బాధపడుతున్నారని, నలుగురు 60ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న వారని తెలిపింది. ఐదుగురిలో నలుగురు గంజాం జిల్లాకు, ఒకరు కందామాల్ జిల్లాకు చెందినవారున్నారు.  కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం గంజాం జిల్లా పూర్తిగా లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నారు. జూలై 17 రాత్రి 9 గంటల నుంచి ఈ  నెల 31 అర్ధరాత్రి వరకు అమలులో ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అసిత్‌ త్రిపాఠి తెలిపారు. రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వివరాల ప్రకారం.. ఒడిషాలో ప్రస్తుతం 19,835 పాజిటివ్‌ కేసులు ఉండగా 13,310 మంది కోలుకోగా, 6,386 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 108 మంది వైరస్‌ బారినపడి మృతి చెందారని అధికారులు పేర్కొన్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo