స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తాజ్వాల ఇంట పెళ్లిసందడి నెలకొంది. గతవారం రోజులుగా గుత్తా ఇంట పెళ్లివేడుకలు గ్రాండ్ గా జరుగుతున్నాయి. తమిళ నటుడు విష్ణువిశాల్ తో ఈ నెల 22వ నా పెళ్లి జరగబోతోందంటూ కొద్దిరోజుల క్రితమే సోషల్ మీడియా వేదికగా గుత్తాజ్వాల ప్రకటించింది. 2005లో చేతన్ ఆనంద్ ని ప్రేమించి పెళ్లాడిన గుత్తాజ్వాల 2011లో విడిపోయారు. అప్పటినుంచి కెరీర్ పైనే దృష్టిపెట్టిన గుత్తా ఆ తర్వాత తమిళ హీరో విష్ణువిశాల్ తో ప్రేమలో పడింది. పలుమార్లు ఈజంట మీడియా కంటపడినా జస్ట్ ఫ్రెండ్స్ అంటూ తప్పించుకున్నారు. అయితే ఇరు కుటుంబసభ్యులు వీరి ప్రేమకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో గతేడాది నిశ్చితార్థం జరిగింది.