శుక్రవారం 14 ఆగస్టు 2020
National - Jul 29, 2020 , 18:32:53

ఢిల్లీలో స్వల్పంగా తగ్గిన కరోనా ఉద్ధృతి

ఢిల్లీలో స్వల్పంగా తగ్గిన కరోనా ఉద్ధృతి

న్యూఢిల్లీ:  ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసులు  క్రమంగా  తగ్గుముఖం పడుతున్నాయి. గతంలో రోజుకు 4వేలకు పైగా నమోదైన  కేసుల సంఖ్య  ప్రస్తుతం  వెయ్యి నుంచి 2 వేల మధ్యలో నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 1,035 మందికి  పాజిటివ్‌గా నిర్ధారణ కాగా, మరో 26 మంది చనిపోయారు.ఒక్కరోజే 1126 మంది కోలుకున్నారు. 

దీంతో ఢిల్లీలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,33,310కు చేరింది.  ఇప్పటి వరకు 1,18,633  మంది కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం 10,770 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స  పొందుతున్నారు. ఇప్పటి వరకు కరోనా వల్ల 3,907 మంది మరణించారు. 


logo