బుధవారం 24 ఫిబ్రవరి 2021
National - Jan 23, 2021 , 13:43:37

ఇది అత్యత్తమ పోలీస్‌ శిక్షణ కళాశాల

ఇది అత్యత్తమ పోలీస్‌ శిక్షణ కళాశాల

సిమ్లా : హిమాచల్ ప్రదేశ్‌లోని దరోహ్ పోలీస్ శిక్షణ కళాశాల దేశంలో మొదటి స్థానాన్ని దక్కించుకున్నది. ఈ విజయానికి గాను కేంద్ర ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖ.. ట్రోఫీతోపాటు రూ.22 లక్షల నగదు పారితోషకాన్ని బహుమతిగా అందజేస్తుంది. 2015-16లో కూడా ఈ కళాశాల దేశంలోనే అత్యుత్తమ శిక్షణ కళాశాలగా నిలిచింది.

హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం ఆధ్వర్యంలో 1995 జూలై 25 న స్థాపించిన ఈ పోలీస్‌ ట్రైనింగ్‌ కాలేజీ.. ఈ ఏడాది సిల్వర్‌ జూబ్లీ జరుపుకుంటున్నది. మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వ నిరంతర మద్దతు, నిధుల ద్వారా ఈ అవార్డును అందుకోగలిగిందని, ఇందుకు ఎంతో సంతోషిస్తున్నట్లు దరోహ్‌ పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ అతుల్ ఫుల్జెలే చెప్పారు. ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్, రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్‌ సంజయ్ కుండుకు ధన్యవాదాలు తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న శిక్షణా సంస్థలను కేంద్ర ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ మూల్యాంకనం చేసిందని, ఇందులో ప్రాథమిక శిక్షణ ఇవ్వడానికి దరోహ్‌ కళాశాల ఉత్తమమైనదిగా ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు. 2017-18 సంవత్సరానికి నాన్-గెజిటెడ్ ఆఫీసర్ గ్రేడ్-1 శిక్షణ కోసం ఉత్తర ప్రాంతంలో అత్యుత్తమ శిక్షణ సంస్థగా ప్రకటించినట్లు ఆయన పేర్కొన్నారు. 

ఇది కూడా చదవండి..

మరణించిన రైతుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు

చరిత్రలో ఈరోజు.. సాయుధ పోరాటంతోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మారు

VIDEOS

logo