e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, October 22, 2021
Home ఎన్‌ఆర్‌ఐ స్వదేశంలో సొంతిల్లు ఉండాలి!

స్వదేశంలో సొంతిల్లు ఉండాలి!

  • ప్రవాస భారతీయులకు కరోనా నేర్పిన పాఠం
  • ఇండ్ల కొనుగోలుకు 53% మంది మొగ్గు
  • సీఐఐ-అనరాక్‌ తాజా సర్వేలో వెల్లడి
  • పెట్టుబడుల ఆకర్షణలో హైదరాబాద్‌కు ఆరో స్థానం

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 19 (నమస్తే తెలంగాణ): కరోనాతో ప్రవాస భారతీయుల ఆలోచనా ధోరణి మారింది. ఇన్నాళ్లూ స్వదేశంలోని ఆస్తులను కేవలం పెట్టుబడిగా మాత్రమే చూసిన ఎన్నారైలకు కరోనా మహమ్మారి కొత్త పాఠం నేర్పింది. పరిస్థితి ఏ క్షణమైనా తలకిందులై స్వదేశానికి తిరిగి వెళ్లాల్సిన అవసరం రావొచ్చన్నదే ఆ పాఠం. దీంతో చాలా మంది ఎన్నారైలు భారత్‌లో ఓ సొంతిల్లు ఉండాలని భావిస్తున్నట్టు సీఐఐ-అనరాక్‌ సంస్థ తాజాగా నిర్వహించిన సర్వేలో
వెల్లడైంది.

సర్వేలో తేలిందేమంటే..

  • స్వదేశంలో సొంతిల్లు ఉండాలని కరోనాకు ముందు (2019లో) 32% మంది ఎన్నారైలు భావించగా.. 2021 నాటికి ఈ సంఖ్య 53 శాతానికి పెరిగింది.
  • కొవిడ్‌ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు గండిపడటం, ఆర్థిక వ్యవస్థలు కోలుకునేందుకు మరింత సమయం పట్టే అవకాశాలుండటంతో భారత్‌కు వెళ్లిపోవాలని కొందరు ఎన్నారైలు అనుకుంటున్నారట.
  • రెండేండ్ల క్రితం భారత్‌లో ఆస్తుల కొనుగోలును 62% మంది ఎన్నారైలు ఒక పెట్టుబడిగా భావించగా.. ఈ ఏడాది అది 47 శాతానికి తగ్గింది.
  • ఎన్నారై పెట్టుబడులను ఆకర్షిస్తున్న నగరాల జాబితాలో హైదరాబాద్‌ ఆరో స్థానంలో, బెంగళూరు అగ్ర స్థానంలో ఉన్నాయి.

విలాసమైన ఇండ్లకే ఓటు
భారత్‌లో ఇల్లు కొనుగోలు చేయాలనుకునే ఎన్నారైలు విలాసవంతమైన ఇండ్లవైపు మొగ్గు చూపుతున్నట్టు సర్వేలో తేలింది. సర్వేలో పాల్గొన్నవారిలో 48% మంది 3బీహెచ్‌కే (కనీసం 1500 చదరపు అడుగులు) వైపు మొగ్గు చూపారు. 4బీహెచ్‌కే లేదా అంతకన్నా ఎక్కువ విస్తీర్ణం ఉన్న ఇండ్లు కావాలని 24% మంది, 2బీహెచ్‌కే ఇండ్లను కొనుగోలు చేస్తామని 28% మంది చెప్పారు.

- Advertisement -

బ్రాండెడ్‌ డెవలపర్లవైపే మొగ్గు
స్వదేశంలో ఇండ్లను కొనుగోలు చేయాలనుకొంటున్న ఎన్నారైలలో ఎక్కువ మంది నమ్మకమైన, బ్రాండెడ్‌ డెవలపర్ల వైపే మొగ్గు చూపుతున్నారు. ఇండ్లకు కావాల్సిన హంగులతోపాటు మంచి ధర, అమ్మిన తర్వాత మంచి సర్వీస్‌ అందించే సంస్థలతోనే మాట్లాడుతున్నారు. ఇలాంటివారంతా చాలా ఏండ్ల కిందటే విదేశాలకు వెళ్లిపోవడం, భారత్‌లో రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌పై పెద్దగా అవగాహన లేకపోవడం ఇందుకు కారణంగా కనిపిస్తున్నది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement