న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బెయిల్ సందర్భంగా ఢిల్లీ హైకోర్టులో అసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. కేజ్రీవాల్‌కు ట్రయల్ కోర్టు మంజూరు చేసిన రెగ్యులర్ బెయిల్‌ను రద్దు చేయాలన్న ఈడీ అభ్యర్థనను అనుమతిస్తే ఈడీ మళ్లీ ఆయనను అరెస్ట్ చేస్తుందా అని జడ్జి ప్రశ్నించారు.
దీనిపై ఈడీ కౌన్సిల్ న్యాయమూర్తికి వివరణ ఇవ్వడంతో ‘ నేను అయోమయంలో ఉన్నా. ఒక వేళ నేను బెయిల్ రద్దు చేస్తే ఏమవుతుంది? మళ్లీ మీరు ఆయనను అరెస్ట్ చేస్తారా?’ అని జడ్జి ప్రశ్నించారు.