జొమాటో సరదా ట్వీట్.. ఇతర బ్రాండ్లకు ప్రమోషనల్ ట్వీట్ అయింది..!

Mon,July 8, 2019 05:05 PM

Zomato Ghar Ka Khana tweet triggers hilarious responses

గయ్స్.. అప్పుడప్పుడు ఇంటి ఆహారం కూడా తినాలి.. అంటూ జొమాటో సరదాగా తన ట్విట్టర్ అకౌంట్‌లో ఓ ట్వీట్‌ను పడేసింది. ఏదో సరదాకి ట్వీటిన ట్వీటు సంచలనాలు సృష్టిస్తుందని జొమాటో కూడా అనుకోలేదు కాబోలు. ఆ ట్వీట్‌పై నెటిజన్లే కాదు.. ఇతర ప్రముఖ బ్రాండ్లు కూడా రెస్పాండ్ అయ్యాయి. మామూలుగా కాదు.. ఆ ట్వీట్‌లాగానే తమ బ్రాండ్‌ను ప్రమోట్ చేసుకున్నాయి.

యూట్యూబ్ ఇండియా, అమెజాన్, ఇక్సిగో, మొబిక్విక్, ఫాసూస్ లాంటి బ్రాండ్స్ ట్వీట్లు చేశాయి. ఆయా ట్వీట్ల స్క్రీన్ షాట్ తీసి మరో ట్వీట్ చేసింది జొమాటో. గయ్స్.. అప్పుడప్పుడు సొంతంగా ట్వీట్లు చేయాలి.... అంటూ ఫన్నీగా ట్వీట్ చేసింది.


3413
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles