మెదడు లేకుండా జీవించే ఉన్నావుగా పప్పునాయుడూ..

Thu,April 18, 2019 04:27 PM

హైదరాబాద్‌ : వైసీపీ నాయకుడు, ఎంపీ విజయసాయి రెడ్డి.. నారా లోకేష్‌పై విరుచుకుపడ్డారు. ఒక కోడి తలకాయ లేకుండా కొన్ని నెలల నుంచి బతికేస్తుందట.. జగన్‌ లాంటి వ్యక్తి ఐదేళ్లు ప్రతిపక్ష నాయకుడిగా నెట్టుకొచ్చాడు.. ఈ విషయంతో పోలిస్తే కోడి సంగతి పెద్ద విచిత్రమా చెప్పండి! అని లోకేష్‌ ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌పై విజయసాయి రెడ్డి ఘాటుగా స్పందించారు. అంతేకాదు.. జగన్‌పై విమర్శలు చేస్తున్న కోడెల శివప్రసాద్‌, దేవినేని ఉమాపై కూడా విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు.


తల లేకుండా కోడి వారం రోజులు బతికిందా? మెదడు లేకుండా నువ్వు 36 సంవత్సరాలుగా జీవించే ఉన్నావుగా పప్పునాయుడూ. ఇంకా ఎన్ని వింతలు సృష్టిస్తావో. ఎంత కామెడీ వెదజల్లుతావో. యూట్యూబ్ ఉన్నంత కాలం నీ సంభ్రమాశ్చార్యాలు ప్రజలను కితకితలు పెడుతూనే ఉంటాయి.

జాతీయ పార్టీల అధ్యక్షులే కింద మీద పడి పిసుక్కుంటున్నారు.చంద్రబాబు ప్రసంగం విని ఎవరైనా ఓట్లేస్తారంటే నమ్మొచ్చా?అది కూడా కర్నాటక,ఇంకో రాష్ట్రంలో.వేదిక ఎక్కి ప్రసంగించాలి.ముందు మూడు నాలుగు వేల మంది గుంపుగా కనిపిస్తేనే మనవాడికి ఆ రాత్రి నిద్ర పడుతుంది.ఇంకా ఐదు వారాలు ఎలా గడవాలో ఏంటో? అని నారా లోకేష్ ను ఉద్దేశించి విజయ సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

వైఎస్సార్ కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా కూడా దక్కదని ఉమ పిడకలు విసురుతున్నాడు. కోడెలేమో జగన్ గారు ఎప్పటికి సిఎం కాలేరని వృద్ధాప్యం వల్ల ఏదేదో మాట్లాడుతున్నాడు. మీరే గెలుస్తుంటే సంబరాలు చేసుకోక సంతాప తీర్మానాలెందుకు చదువుతున్నారు. సొంత డబ్బా అలవాటే గదా. కొట్టుకోండి పోయేదేముంది అని దేవినేని ఉమ, కోడెల శివప్రసాద్ ను ఉద్దేశించి మరో ట్వీట్ చేశారు విజయసాయి రెడ్డి.
4563
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles