ఏపీ స్పీకర్‌గా తమ్మినేని సీతారాం?

Fri,June 7, 2019 01:09 PM

YSRCP MLA Thammineni Seetharam will elected as AP Speaker

హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ స్పీకర్‌గా ఎవర్ని ఎంపిక చేస్తారనే అంశంపై కాస్త క్లారిటీ వచ్చింది. ఆముదాలవలస నుంచి వైఎస్సార్‌సీపీ తరపున గెలిచిన తమ్మినేని సీతారాంను స్పీకర్‌గా నియమిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ ఆ రాష్ట్ర సీఎం జగన్‌ను సీతారాం ఇవాళ కలిశారు. సీతారాం కళింగ(బీసీ) సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆముదాలవలస నుంచి 1983లో మొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు సీతారాం. అప్పట్నుంచి ఇప్పటి వరకు ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1985లో ప్రభుత్వ విప్‌గా, 1994లో చంద్రబాబు కేబినెట్‌లో మున్సిపల్‌ శాఖ మంత్రిగా సీతారాం సేవలందించారు.

ఇటీవల జరిగిన ఏపీ శాసనసభ ఎన్నికల్లో టీడీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే కూన రవికుమార్‌పై తమ్మినేని సీతారాం 13,856 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. సీతారాంకు 77,233 ఓట్లు వచ్చాయి. కూన రవికుమార్‌కు 63,377 ఓట్లు వచ్చాయి. జనసేన అభ్యర్థి పేడాడ రామ్మోహన్‌రావు మూడో స్థానంలో, కాంగ్రెస్‌ అభ్యర్థిని బొడ్డేపల్లి సత్యవతి నాలుగో స్థానంలో నిలిచారు.

1979
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles