టీడీపీ ఉద్దేశపూర్వకంగా గొడవలు సృష్టించేందుకు కుట్రలు

Sat,May 18, 2019 01:22 PM

YSRCP leaders  meets  CEC in New Delhi

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో కౌంటింగ్, రీపోలింగ్‌లో భద్రత పెంచాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, సీనియర్ నేతలు కేంద్ర ఎన్నికల సంఘం సభ్యులను కలిసి విజ్ఞప్తి చేశారు. కౌంటింగ్ ప్రక్రియను సీసీ కెమెరాలతో పర్యవేక్షించాలని కోరారు. కౌంటింగ్ రోజున టీడీపీ అలజడులు సృష్టించే అవకాశం ఉందని ఫిర్యాదు చేశారు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర భద్రత పెంచాలని ఈసీకీ విజ్ఞప్తి చేశామని వైసీపీ పేర్కొంది. శాంతియుతంగా కౌంటింగ్ జరిగేలా చూడాలని కోరినట్లు పార్టీ నేతలు వివరించారు. మాక్‌ పోలింగ్‌లో పడిన వీవీ ప్యాట్‌ స్లిప్పులు తొలగించని పక్షంలో ఓట్ల లెక్కింపులో తేడా వచ్చే అవకాశం ఉందని.. వీటికి సంబంధించిన మార్గదర్శకాలను ఎన్నికల సంఘం వెంట‌నే వెలువరించాలని వైసీపీ నేతలు ఎన్నిక‌ల సంఘానికి సమర్పించిన వినతి పత్రంలో పేర్కొన్నారు. సీఈసీని కలిసిన వారిలో ఎంపీ విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, మేకపాటి రాజమోహన్‌ రెడ్డి, బుట్టా రేణుక, రవీంద్రబాబు, అవంతి శ్రీనివాస్‌ తదితరులు ఉన్నారు.

3031
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles