ఆ నేమ్ ప్లేట్ సృష్టి టీడీపీ పనే

Tue,April 16, 2019 12:08 PM

YSRCP leader Vijayasai reddy responds on Jagan number plate

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని రాసి ఉన్న నేమ్ ప్లేట్ గత రెండు, మూడు రోజుల నుంచి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేమ్ ప్లేట్‌పై తెలుగుదేశం పార్టీ నాయకులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడడంతో.. వైసీపీ నాయకుడు విజయసాయి రెడ్డి ట్విట్టర్‌లో స్పందించారు. ముఖ్యమంత్రి ఆఫీస్ నేమ్ ప్లేట్ ఎవరు తయారు చేయిస్తారో తెలియదా? అని టీడీపీ నాయకుడు దేవినేని ఉమాను ప్రశ్నించారు. ఎవరూ సొంతంగా తయారు చేయించుకుని ఆఫీసు ముందు తగిలించుకోరు. మీరే ఒక గ్రాఫిక్ నేమ్ ప్లేట్ సృష్టించి దానిపై పిచ్చి కూతలు కూస్తున్నారని అందరికీ తెలిసిపోయిందని పేర్కొన్నారు. ఫ్రస్టేషన్‌లో మీ మాటలే కాదు.. చేతలూ కూడా అసహ్యం కలిగిస్తున్నాయని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.



2901
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles