మరో 4 వారాలు ఓపిక పట్టు ఉమా..

Fri,April 26, 2019 12:44 PM

YSRCP leader Vijayasai reddy fire on Devineni Uma

హైదరాబాద్ : వైఎస్సార్‌సీపీ నాయకుడు విజయసాయి రెడ్డి.. ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర్‌రావుపై నిప్పులు చెరిగారు. మరో నాలుగు వారాలు ఓపిక పడితే.. ఈ ఐదేళ్ల కాలంలో నీటిపారుదల శాఖలో నువ్వు సాగించిన అరాచకం అంతా బయటకొస్తుందని దేవినేని ఉమను ఉద్దేశించి విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. అధికారులు, బాధితులైన కాంట్రాక్టర్లు నీ దోపిడీ వ్యవహారాల ఫైళ్లను స్వచ్ఛందంగా తెచ్చిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. పోలవరం, హంద్రీనీవాల్లో రెండేళ్లలోనే వందల రెట్లు అంచనాలు పెంచింది నిజం కాదా? అని దేవినేని ఉమాను విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.2593
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles