బాబు పాలనలో అప్పులు రూ.2.50 లక్షలకు కోట్లకు చేరాయి!

Sun,May 26, 2019 02:54 PM

YSR Congress Party Chief YS Jagan Mohan Reddy Speaks to Media

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను ప్రధాని నరేంద్రమోదీకి వివరించానని వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి తెలిపారు. ఢిల్లీలో విలేకరుల సమావేశంలో జగన్‌ మాట్లాడుతూ.. కేంద్రం నుంచి రాష్ర్టానికి ఆర్థిక సాయం అవసరముందని ప్రధానిని అభ్యర్థించాను. ప్రత్యేక హోదా ఆవశ్యకతను ప్రధానికి తెలిపాను. రాష్ట్ర సమస్యలపై ప్రధాని సానుకూలంగా ఉన్నారనుకుంటున్నా. ప్రధానిని ఎప్పుడు కలిసినా ప్రత్యేక హోదాను అడుగుతూనే ఉంటా. రాష్ట్రం ఓవర్‌ డ్రాఫ్ట్‌పై బతకాల్సిన పరిస్థితులు ఉన్నాయి. రాష్ట్రం విడిపోయే నాటికి రూ.97వేల కోట్లు అప్పులు ఉంటే.. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో రూ.2లక్షల 57వేల కోట్లకు అప్పలు చేరాయి.

మద్యపాన నిషేధంపై ఇప్పటికే స్పష్టంగా చెప్పాం. దశలవారీగా మద్యపాన నిషేధం అమలు చేస్తాం. మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంలా భావిస్తాను. మేనిఫెస్టోలో ఉన్న అంశాలను అమలయ్యేలా చూస్తాం. విశ్వసనీయతకు ప్రజలు పట్టం గట్టారు. విశ్వసనీయత సన్నగిల్లకుండా పాలన కొనసాగిస్తాం. కేంద్రంపై ఇంతగా ఆధారపడాల్సిన పరిస్థితులు ఎప్పుడూ రాలేదు. రాష్ర్టాన్ని బాగా నడపాలనే తపన నాకు ఉంది. రాష్ర్టానికి చాలా ఆర్థిక సమస్యలు ఉన్నాయి. అని జగన్‌ పేర్కొన్నారు.

3947
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles