సాయంత్రం కేసీఆర్‌తో జగన్ భేటీ..

Sat,May 25, 2019 01:58 PM

YS Jagan to Meet Modi Tomorrow At Delhi

అమరావతి: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి పర్యటన షెడ్యూల్‌ ఖరారైంది. ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటలకు జగన్‌ గన్నవరం విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు బయల్దేరనున్నారు. సాయంత్రం 4.30 గంటలకు గవర్నర్‌ నరసింహన్‌తో జగన్‌ భేటీకానున్నారు. వైఎస్‌ఆర్‌ఎల్పీ తీర్మానాన్ని గవర్నర్‌కు అందజేయనున్నారు. సాయంత్రం 5.30 గంటలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనూ వైఎస్‌ జగన్‌ సమావేశం కానున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారానికి కేసీఆర్‌ను వైఎస్‌ జగన్‌ ఆహ్వానించనున్నారు. ఆదివారం ఉదయం 8.30 గంటలకు జగన్‌తో పాటు సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఢిల్లీ వెళ్తారు. మధ్యాహ్నం ప్రధాని నరేంద్రమోదీతో జగన్‌ భేటీకానున్నారు. ఈ నెల 30న విజయవాడలో సీఎంగా తన ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరుకావాలని మోదీని ఆహ్వానించనున్నారు.

2829
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles