ఏపీలో రైతుల పరిస్థితి కరుగుతున్న కొవ్వొత్తిలా తయారైంది..!

Sun,March 24, 2019 01:34 PM

గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌లో రైతుల పరిస్థితి కరుగుతున్న కొవ్వొత్తిలా తయారైంది. రైతుల భూములను బలవంతంగా లాక్కుంటున్నారని వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు. గుంటూరులోని రేపల్లె సభలో జగన్‌ పాల్గొని ప్రసంగించారు. మత్స్యకారులకు చంద్రబాబు చేసిందేమీ లేదు. ఆక్వా రైతులు ఈ ఐదేళ్లలో నష్టాలు మూటగట్టుకున్నారు. ఆక్వా రైతులన్ని దళారులు దోచుకున్నారు. రైతులకు మిగిలేది కష్టం.. నష్టం అన్నట్లుగా పాలన ఉంది. అన్నం పెట్టే రైతు.. ఆకలితో మాడుతున్నాడు. రైతులకు ఇన్‌ఫుట్‌ సబ్సిడీ లేదు.. బీమా లేదు. . పెట్టుబడి లేదు. రైతులకు పంట బీమా, వడ్డీ లేని పంట రుణాలు ఇస్తాం. వ్యవసాయానికి పగటిపూటే..9 గంటల విద్యుత్‌ ఇస్తాం. వైఎస్‌ఆర్‌ బీమా కింద.. ఏడు లక్షల పరిహారం ఇస్తాం. అప్పుల వాళ్లు ఆ సొమ్ము తీసుకోకుండా చట్టం చేస్తాం. అసెంబ్లీలో చట్టాన్ని కూడా తీసుకువస్తాం. చెరువులకు జలకళ తీసుకువస్తా. రూ.4వేల కోట్లతో ప్రకృతి విపత్తుల నిధి ఏర్పాటు చేస్తాం. ట్రాక్టర్లకు రోడ్డు, టోల్‌ ట్యాక్స్‌ రద్దు చేస్తాం. పిల్లలను చదివించాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తోంది. చంద్రబాబు ఇచ్చే రూ.3వేలకు మోసపోకండి. 20 రోజులు ఓపిక పడితే వచ్చేది వైసీపీ ప్రభుత్వమే. చంద్రబాబు చేతిలో మరోసారి మోసపోవద్దు. అగ్రిగోల్డ్‌ బాధితుల బాధను నేను విన్నాను మీకు తోడుగా ఉంటాను. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని ఆశీర్వదించండి. అని జగన్‌ విజ్ఞప్తి చేశారు.

1900
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles