చంద్ర‌బాబు.. కోటయ్యను మీరే చంపేశారు..!

Tue,February 19, 2019 01:39 PM

YS Jagan Mohan Reddy Tweet On Farmer Kotayya Death

హైదరాబాద్: వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు సభ కోసం ఓ రైతును అన్యాయంగా చంపిన ఘటనపై జగన్ తన ట్విటర్ ఖాతాలో స్పందించారు. ''కొండవీడులో బీసీ రైతు కోటయ్య గారిని మీరే చంపేశారు ముఖ్యమంత్రి చంద్ర‌బాబు గారు. మీ హెలికాప్టర్ దిగడానికి ఆయన బొప్పాయి పొలాన్ని నాశనం చేశారు. పొలంలోకి వెళ్లేందుకు ప్రయత్నించి పోలీస్‌ దెబ్బలకు రైతు నేలకొరిగాడు. కొన ఊపిరితో ఉన్న రైతును అక్కడే వదిలేశారు. మానవత్వం చూపాల్సిన సందర్భాల్లో ఈ రాక్షసత్వం ఏమిటీ చంద్రబాబు గారూ?'' అని జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం కొండవీడు కోట ఫెస్టివల్‌లో సీఎం చంద్రబాబు సోమవారం పాల్గొన్న విష‌యం తెలిసిందే.


రైతు కోటయ్య మృతదేహానికి కాసేపట్లో పోస్టుమార్టం నిర్వహించనున్నారు. కోటయ్య చనిపోయిన 20 గంటల తర్వాత ఏపీ పోలీసులు స్పందించారు. హడావుడిగా చిలుకలూరిపేట ఆస్పత్రిలో పోస్టుమార్టంకు ఏర్పాట్లు చేశారు. వైఎస్‌ఆర్‌సీపీ, రైతు సంఘాల నేతలు ఆస్పత్రి దగ్గరకు చేరుకున్నారు. రైతు కోటయ్య మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు.2049
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles