సీఎం కేసీఆర్‌ను కలిసిన వైఎస్‌ జగన్‌

Sat,May 25, 2019 05:42 PM

YS Jagan meets KCR

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రగతిభవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. జగన్‌ ప్రగతి భవన్‌కు రావడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మంత్రులు జగన్‌కు ఘనస్వాగతం పలికారు. ఈనెల 30న తన ప్రమాణస్వీకారానికి హాజరుకావాలని కేసీఆర్‌ను జగన్‌ ఆహ్వానించారు. గవర్నర్‌ నరసింహన్‌తో భేటీ అనంతరం జగన్‌ నేరుగా ప్రగతిభవన్‌కు వెళ్లారు. ప్రగతిభవన్‌ వద్ద జగన్‌ అభిమానులు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. కేసీఆర్‌తో సమావేశం అనంతరం లోటస్‌పాండ్‌కు వెళ్లనున్నారు.

జగన్‌ దంపతులకు స్వాగతం పలికిన సీఎం కేసీఆర్‌

వైఎస్‌ జగన్‌ దంపతులకు సీఎం కేసీఆర్‌ సాదరంగా స్వాగతం పలికారు. దంపతులకు కేసీఆర్‌ పుష్పగుచ్చాలు ఇచ్చారు. అనంతరం ఆత్మీయంగా జగన్‌ను ఆలింగనం చేసుకొని కేసీఆర్‌ అభినందించారు. జగన్‌ను శాలువాతో సత్కరించి.. హంవీణ బహూకరించారు. వైఎస్‌ జగన్‌తో పాటు ఆయన సతీమణి వైఎస్‌ భారతి, విజయ సాయిరెడ్డి, మిథున్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

4812
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles