నామినేషన్‌ వేసిన వైఎస్‌ జగన్‌

Fri,March 22, 2019 02:49 PM

కడప(పులివెందుల): క‌డ‌ప జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఇవాళ నామినేషన్‌ దాఖలు చేశారు. స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో మధ్యాహ్నాం 1.49 గంటలకు రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. నామినేషన్‌ పత్రాలు సమర్పించే ముందు జగన్‌ సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. జగన్‌ వెంట కుటుంబసభ్యులు, సీనియర్‌ నేతలు, పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. వేలాది మంది నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తరలిరావడంతో పులివెందుల జనసంద్రమైంది. అంతకుముందు స్థానిక సీఎస్‌ఐ చర్చి మైదానంలో జరిగిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి జగన్‌ ప్రసంగించారు.

2445
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles