45 ఏళ్లు దాటిన మహిళలకు రూ.75వేలు..!

Mon,March 18, 2019 05:50 PM

YS Jagan Election campaign

కడప: పాదయాత్రలో అందరి కష్టాలు తెలుసుకున్నాను. ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలన్నదే నా కోరిక. నేను ఉన్నాననే భరోసా ప్రతి ఒక్కరికి ఇస్తున్నానని వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్‌రెడ్డి తెలిపారు. రాయచోటిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొని జగన్ ప్రసంగించారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు భరోసా ఇస్తున్నా. రాష్ట్రంలో రైతుల కష్టాలు తీరాలి. ఫీజులు కట్టలేక పిల్లలు బడులు మానేస్తున్నారు. కడప స్టీల్ ప్లాంట్ ఇస్తే 10వేల ఉద్యోగాలు వచ్చేవి. ఉపాధి లేక పక్క రాష్ర్టాలకు వలసలు పోతున్నారు. రుణమాఫీ అని చెప్పి చంద్రబాబు మోసం చేశారు. జగన్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏడాదికి రూ.12,500 ఇస్తామని ప్రతి రైతన్నకు చెప్పండి. వైఎస్‌ఆర్ చేయూత పథకం కింద 45ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు నాలుగు దఫాల్లో రూ.75వేలు ఇస్తాం. డ్వాక్రా మహిళలకు ఎంత రుణం ఉన్నా కూడా నేరుగా చెల్లిస్తాం. చంద్రబాబు మాటలకు మోసపోవద్దు. బ్యాంకుల నుంచి సున్నా వడ్డీకే రుణాలిచ్చే రోజులు వస్తాయి. గెలవడం కోసం చంద్రబాబు ఏమైనా చేస్తారు. ధర్మానికి అధర్మానికి మధ్య యుద్ధం జరుగుతోందని జగన్ పేర్కొన్నారు.

8650
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles