జింకల పార్కులో యువకుడి మృతదేహం

Sun,October 13, 2019 06:20 PM


న్యూఢిల్లీ: ఢిల్లీలోని జింకల పార్కులో ఓ యువకుడు అనుమాస్పద స్థితిలో మృతి చెందాడు. ఢిల్లీ పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా పార్కులో కాళ్లు, చేతులు కట్టేయబడి ఉన్న మృతదేహాన్ని గుర్తించారు. మృతుడిని కలందర్ కాలనీకి చెందిన సాహిల్ (18) గా గుర్తించారు. శనివారం రాత్రి 11.45 గంటల ప్రాంతంలో తమ కుమారుడు సాహిల్ స్కూటర్‌పై ఇంటి నుంచి బయటకెళ్లి తిరిగిరాలేదని..అతని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అతని కోసం గాలింపు చేపట్టారు. జింకల పార్కులోని దిల్షద్ గార్డెన్ వద్ద స్కూటర్‌ను గమనించి..సాహిల్ మృతదేహాన్ని గుర్తించారు. సాహిల్ తల, మెడపై బలమైన కత్తిగాట్లున్నాయి. హత్య కేసుగా నమోదుచేసి అనుమానితులను అదుపులోకి తీసుకుని అన్ని కోణాల్లో విచారిస్తున్నామని డీసీపీ అమిత్ శర్మ తెలిపారు.

3125
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles