స్కూల్ విద్యార్థినిపై బ్లేడ్‌తో దాడిSun,December 17, 2017 07:16 PM
స్కూల్ విద్యార్థినిపై బ్లేడ్‌తో దాడి

కర్నాటక: స్కూల్ విద్యార్థినిపై బ్లేడ్‌తో ఓ యువకుడు దాడి చేసిన ఘటన హొన్నావర్‌లోని కొడ్లుగడ్డె గ్రామంలో చోటు చేసుకున్నది. తొమ్మిదో తరగతి చదివే బాలికపై బ్లేడ్‌తో యువకుడు అటాక్ చేశాడు. బాలికను తన కారులోకి ఎక్కాలని ఆ యువకుడు బలవంతం చేయడంతో బాలిక భయపడిపోయింది. కారులోకి ఎక్కడానికి బాలిక తిరస్కరించింది. వెంటనే కోపంతో తన దగ్గర ఉన్న బ్లేడ్‌తో బాలిక చేతులపై కోశాడు. దీంతో ఆ బాలిక చేయికి రక్త స్రావం అయింది. వెంటనే గమనించిన స్థానికులు విద్యార్థినిని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మిగితా వివరాలు తెలియాల్సి ఉంది.

2631
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS