యూపీలో రూ.10కే యోగిథాలీ

Mon,September 3, 2018 03:17 PM

yogi thali in up

హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ రు.5కే కడుపునిండా భోజనం పెడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే తరహాలో యూపీ కూడా యోగి థాలీని ప్రవేశపెట్టింది. కాకపోతే ఇది ప్రభుత్వ పథకం కాదు. ఓ ప్రైవేటు వ్యక్తి సాయంతో ఈ భోజనశాలలు ఏర్పాటయ్యాయి. యూపీ సీఎంను దృష్టిలో పెట్టుకుని పథకానికి ఆపేరు పెట్టినట్టు తెలుస్తూనే ఉంది. ఈ థాలీలో అన్నం, రొట్టెతోపాటు కూర, పప్పు, పచ్చడి, సలాడ్ ఉంటాయి. అలహాబాద్‌లో ఆదివారం ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. వికలాంగులు, పేదలు, అవసరార్థులు ఈ పథం వల్ల లబ్ధి పొందుతారని, సాధుసంతులకు కూడా ఉపయగోకరంగా ఉంటుందని మేయర్ అభిలాష గుప్తా చెప్పారు. ఎవరైనా దాతలు ముందుకు వస్తే యోగి థాలీని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తామని వివరించారు.

3500
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles