బలపరీక్షపై కొనసాగుతోన్న ఉత్కంఠ..

Mon,July 22, 2019 09:15 PM

yedyurappa demanded to cm kumaraswamy must be prove the majority today


బెంగళూరు: కర్ణాటక రాజకీయాలు గంట గంటకు రసవత్తరంగా మారుతున్నాయి. శాసనసభలో కాంగ్రెస్-జేడీ(ఎస్) సంకీర్ణ ప్రభుత్వం బలపరీక్షపై నెలకొన్న ఉత్కంఠ కొనసాగుతోంది. విరామం అనంతరం సభ ప్రారంభం కాగానే బీజేపీ సభ్యులు బలపరీక్ష నిర్వహించాలని పట్టుబడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో విశ్వాస పరీక్షను ఇవాళ నిర్వహించాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు సభను వాయిదా వేయాలని కాంగ్రెస్-జేడీ(ఎస్) సభ్యులు నినాదాలు చేస్తున్నారు. అధికార, విపక్ష సభ్యుల నినాదాలతో అసెంబ్లీలో గందరగోళ వాతావరణం నెలకొంది.


విశ్వాస పరీక్షను నేడు పూర్తి చేస్తామని సీఎం కుమారస్వామి హామీనిచ్చారు. ఆ మాట ప్రకారం ఇవాళే బలపరీక్ష నిర్వహించాలి. విశ్వాస పరీక్షను ఖచ్చితంగా ఎట్టిపరిస్థితుల్లో నేడే నిర్వహించాలని చీప్ విప్ ను ప్రతిపక్ష నేత యడ్యూరప్ప డిమాండ్ చేశారు. విశ్వాస పరీక్ష కోసం తాము ఉదయం 12 గంటల వరకు సభలో ఉంటామని ఆయన స్పష్టం చేశారు. రాజ్యాంగాన్ని రక్షించాలంటూ కాంగ్రెస్-జేడీ(ఎస్) ఎమ్మెల్యేలు నినాదాలు చేస్తుండటంతో..ఇలా చేయడ్ం సరైంది కాదని, తాను 12 గంటల వరకు సభలో ఉంటానని స్పీకర్ కేఆర్ రమేశ్ కుమార్ స్పష్టం చేశారు. సభకు మొత్తం 205 మంది సభ్యులు హాజరవగా..బలపరీక్ష నిర్వహిస్తే 105 మంది సభ్యుల సంఖ్యాబలం అవసరం. రాజీనామా చేసిన 15 మందితోపాటు మరో నలుగురు గైర్హాజరయ్యారు.

942
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles