రాజీనామా యోచనలో యడ్యూరప్ప?

Sat,May 19, 2018 02:39 PM

Yeddyurappa might resign if numbers fall short claim reports

బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి యడ్యూరప్ప రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. యడ్యూరప్ప రాజీనామాపై కన్నడ, జాతీయ మీడియాలో వార్తలు షికారు చేస్తున్నాయి. ఈ వార్త‌ల‌ను బీజేపీ కూడా ఎక్క‌డా ఖండించ‌లేదు. దీంతో ఈ ఊహాగానాల‌కు బ‌లం చేకూరుస్తున్న‌ట్ల‌యింది. బలపరీక్ష కంటే ముందే యడ్యూరప్ప రాజీనామా చేయనున్నట్లు తెలుస్తుంది. అంతకంటే ముందే సభలో యడ్యూరప్ప మాట్లాడి గవర్నర్‌ను కలుస్తారని సమాచారం.


ఈ క్రమంలో యడ్డీ తన రాజీనామా లేఖను సిద్ధం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నిన్న గాలి జనార్ధన్‌రెడ్డి, నేడు యడ్యూరప్ప పేరుతో ప్రలోభాల టేపులను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన నేపథ్యంలో బీజేపీకి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని ఆ పార్టీ సీనియర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ తరుణంలో పార్టీకి ఇబ్బందికర పరిస్థితి తీసుకురావొద్దని ప్రధాని మోదీ యడ్యూరప్పకు సూచించినట్లు సమాచారం.


కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసి.. తమ వైపు లాక్కొనేందుకు బీజేపీ నేతలు యత్నిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. మంత్రి పదవులు ఆశజూపి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లాగే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మిస్ అయ్యారు. 222 శాసనసభ స్థానాలకు ఎన్నికలు జరగ్గా 104 స్థానాలను బీజేపీ, 78 స్థానాల్లో కాంగ్రెస్, 36 స్థానాల్లో జేడీఎస్ గెలుపొందిన విషయం విదితమే. అయితే మేజిక్ ఫిగర్ 111. మేజిక్ ఫిగర్ ను చేరుకోవాలంటే బీజేపీకి మరో ఏడుగురు ఎమ్మెల్యేల మద్దతు అవసరం.

2533
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles