ముగిసిన యడ్యూరప్ప కథ..కింగ్ కుమార‌స్వామే!

Sat,May 19, 2018 04:30 PM

Yeddurappa story is closes as CM in Karnataka

బెంగళూరు : అనేక మలుపులు.. ఎన్నో ఎత్తుగడలు.. క్యాంపు రాజకీయాలు.. నరాలు తెగే ఉత్కంఠ తర్వాత కర్ణాటక రాజకీయాల్లో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన బీజేపీ నేత యడ్యూరప్ప కథ ముగిసింది. బలపరీక్షలో నెగ్గడానికి ఏడుగురు ఎమ్మెల్యేలు తక్కువ కావడంతో బలపరీక్షకు వెళ్లకుండానే యడ్యూరప్ప వెనుదిరిగారు. అసెంబ్లీలో ఉద్వేగ పూరిత ప్రసంగం చేసిన అనంతరం సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన యడ్డీ రాజీనామా లేఖను గవర్నర్‌కు సమర్పించడానికినేరుగా రాజ్‌భ‌వ‌న్ వెళ్లారు.

దీంతో కాంగ్రెస్, జేడీఎస్ శిబిరాల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. కుమారస్వామే తమ సీఎం అంటూ అసెంబ్లీలో కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు విక్టరీ సింబల్స్ చూసిస్తూ నినాదాలు చేశారు. మొత్తం అనూహ్య మలుపుల అనంతరం కర్ణాటకలో రాజకీయ వేడి చల్లారింది. ఇక మిగిలింది కుమార స్వామిని ప్రమాణ స్వీకారం చేయడానికి గవర్నర్ పిలవడం, అనంతరం ఆయన తన బలాన్ని నిరూపించుకోవడం. మొత్తం మీద ముందుగా అనుకున్నట్లు కింగ్‌మేకరే కింగ్ అవుతున్నారు.

3624
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles