ప్రజాశాంతి పార్టీ గుర్తు హెలికాప్టర్‌పై ఫిర్యాదు

Fri,March 22, 2019 05:52 PM

YCP mp  Vijaya Sai Reddy meets CEC Sunil Arora

న్యూఢిల్లీ: ప్రజాశాంతి పార్టీ ఎన్నికల గుర్తుపై కేంద్ర ఎన్నికల సంఘానికి వైఎస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు చేసింది. ప్రజాశాంతి పార్టీ గుర్తు తమ పార్టీ సింబల్‌ను పోలి ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఈసీ సునీల్‌ అరోరాను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో టీడీపీ అధికార దుర్వినియోగంపై ఫిర్యాదు చేశాం. డీజీపీ ఠాకూర్‌ను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని విజ్ఞప్తి చేశాం. చట్టాన్ని అతిక్రమిస్తున్న పోలీసులను తొలగించాలని కోరాం. నిబంధనలకు విరుద్ధంగా 37 మందిని ప్రమోట్‌ చేసిన విషయాన్ని సీఈసీ దృష్టికి తీసుకెళ్లాం. పోలీసులతో డబ్బులు తరలిస్తున్న సాక్ష్యాధారాలను సీఈసీకి ఇచ్చాం. ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు, యోగానంద్‌ ఫోన్ల ట్యాపింగ్‌కు పాల్పడుతున్న సాక్ష్యాలను సీఈసీకి ఇచ్చాం. ప్రజాశాంతి పార్టీ గుర్తు.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గుర్తును పోలి ఉందని...మరోసారి పునఃపరిశీలించాలని సీఈసీని కోరినట్లు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

2800
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles