కూతుర్ని చూసేందుకు విదేశాలకు వెళ్లడం తప్పా?

Fri,February 22, 2019 04:07 PM

YCP Mla Srikanth Reddy Fires on Ap CM Chandrababu Naidu

హైదరాబాద్: చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో ఉండి నీచ రాజకీయాలు చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. అస్తమానం జగన్‌ను తిడుతూ.. చంద్రబాబు దిగజారి మాట్లాడుతున్నారు. జగన్ తన కూతుర్ని చూసేందుకు విదేశాలకు వెళ్లడం తప్పా?. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలకు మద్దతుగా చంద్రబాబు మాట్లాడటం దేశద్రోహం కిందికే వస్తుంది. హెలికాప్టర్ ల్యాండింగ్ కోసం ఓ రైతు ప్రాణాన్ని అన్యాయంగా బలితీసుకున్నారు. మేం ఆ రైతు కుటుంబానికి అండగా నిలబడితే కుల రాజకీయాలు చేస్తున్నారంటూ ఎద్దేవా చేస్తున్నారు. దళితుల పట్ల చంద్రబాబు అవహేళనగా మాట్లాడితే చంద్రబాబు ఖండించకపోవడం దారుణం. సీఎం చేస్తున్న ప్రతీ ఆరోపణలపై చర్చించేందుకు మేం సిద్ధంగా ఉన్నామని శ్రీకాంత్ రెడ్డి సవాల్ చేశారు.

2859
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles