రౌడీ చింతమనేనికి విప్ పదవి ఇచ్చి ప్రజలపైకి వదిలేశారు..!

Fri,February 22, 2019 11:21 AM

YCP MLA Roja Fires On AP CM Chandrababu Naidu

తిరుమల: ఏపీ సీఎం చంద్రబాబుకు అసహనం పెరిగిపోయిందని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. జగన్‌పై చంద్రబాబు చేస్తున్న ఆరోపణలను ఖండించిన రోజా మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్‌రెడ్డిపై కేసులు పెట్టారు. తప్పు చేయలేదు కాబట్టే జగన్.. ధైర్యంగా విచారణకు హాజరవుతున్నారు. కడిగిన ముత్యంలా నిర్దోషిగా జగన్ బయటపడతారు. 18కేసుల్లో స్టే తెచ్చుకుని విచారణకు హాజరుకాని ముద్దాయి చంద్రబాబు. దేశంలో మహిళలను వేధించిన నలుగురు మంత్రుల్లో ఇద్దరు చంద్రబాబు కేబినెట్‌లోనే ఉన్నారు. రౌడీ చింతమనేనికి విప్ పదవి ఇచ్చి ప్రజలపైకి వదిలేశారు.

బాంబులు పేల్చిన కోడెల.. గన్ పేల్చిన బాలకృష్ణను పక్కన పెట్టుకున్నది బాబు కాదా?.

తనకు రాజకీయంగా అడ్డు వచ్చే వారిని అడ్డు తొలగించుకునే వ్యక్తి చంద్రబాబు. గతంలో రంగారెడ్డి, మాధవరెడ్డి, పరిటాలను అలానే తొలగించారు. జగన్‌ను ఎదుర్కోలేకే..ఆయనపై హత్యాయత్నం చేయించారు. వైఎస్ జగన్‌కు వస్తున్న ప్రజాదరణ చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు. అందుకే జగన్‌ను అక్కినేని నాగార్జున కలిస్తే ఎందుకని ప్రశ్నిస్తున్నారు. నేరారోపణలు, నేరచరిత్ర కలిగిన వారిని పక్కన పెట్టుకున్నది చంద్రబాబే. సొంత మామను వెన్నుపోటు పోడిచిన చరిత్ర చంద్రబాబుది. ఇంట్లో బాంబులు పేల్చిన కోడెల.. గన్ పేల్చిన బాలకృష్ణను పక్కన పెట్టుకున్నది చంద్రబాబు కాదా?. అని రోజా ప్రశ్నించారు.

2264
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles