బాబు మోచేతి నీళ్లు తాగే జేడీకి మా పార్టీలో స్థానం లేదు..

Mon,April 22, 2019 01:09 PM

YCP Leader Vijayasai reddy attack on JD Laxmi Narayana Politics

హైదరాబాద్‌ : జనసేన పార్టీ నాయకుడు జేడీ లక్ష్మీనారాయణపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి వరుస ట్వీట్లతో ధ్వజమెత్తుతున్నారు. ఇవాళ తాజాగా జేడీకి చురకలంటించారు విజయసాయి రెడ్డి. చంద్రబాబు మోచేతి నీళ్లు తాగే జేడీకి తమ పార్టీలో ఎన్నటికీ స్థానం లేదు. ఉండదు కూడా అని ఆయన స్పష్టం చేశారు. బహుశా ఆయన చేరాలనుకున్నారేమో.. కోవర్టు ఆపరేషన్ల కోసం వచ్చే ఆలోచన చేశారని ఇప్పుడు అనిపిస్తుంది. సీబీఐ లాంటి సంస్థను బాబుకు పాదాక్రాంతం చేసిన వ్యక్తి దేశాన్ని మార్చే కలలు కంటున్నాననడం పెద్ద జోక్‌ అని విజయసాయిరెడ్డి విమర్శించారు.

ఈవీఎంలపై చంద్రబాబు మతితప్పి మాట్లాడుతుంటే దాన్నిబలపరుస్తూ కాంగ్రెస్ కూడా రంగంలోకి దిగింది. ఘోర పరాజయం తర్వాత ఎన్నికలను రద్దు చేయాలని చంద్రబాబు డిమాండు చేసినా ఆశ్చర్యం లేదు. పోలింగ్ బూత్‌లకు వెళ్లి ఓటేసిన 80 శాతం మంది ప్రజలకు లేని అనుమానాలు తుప్పు బాబుకు వస్తున్నాయి అని విజయసాయి రెడ్డి నిప్పులు చెరిగారు.









4650
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles