ఓట్లనే కాదు.. ఏకంగా మనుషులనే తొలగిస్తున్నారు..!

Fri,March 15, 2019 05:03 PM

YCP Leader Malladi Vishnu Comments On   CM Chandra Babu Naidu

విజయవాడ: టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నిజస్వరూపం బట్టబయలైందని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. వివేకానందరెడ్డి హత్యపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు హత్యా రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారు. వివేకా హత్య వెనుక ఆదినారాయణరెడ్డి హస్తం ఉంది. ఓట్లనే తొలగిస్తున్నారని అనుకున్నాం.. కానీ మనుషులనే తొలగిస్తున్నారు. అని మల్లాది ఆరోపించారు.

వివేకా హత్యపై సీబీఐ విచారణ జరపాలని వాసిరెడ్డి పద్మ డిమాండ్‌ చేశారు. నిన్నంతా జమ్మలమడుగు ఎన్నికల ప్రచారంలో వివేకా పాల్గొన్నారు. ఇంతలోనే వివేకానందరెడ్డిని హత్య చేశారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిని కడప ఎంపీగా ప్రకటించినప్పుడే మహా కుట్రకు బీజం పడింది. కడపను కొట్టితీరుతామని టీడీపీ నేతలు చాలాసార్లు మాట్లాడారు. పులివెందులను కూడా గెలుస్తామని టీడీపీ మంత్రులు పదేపదే చెప్పారు. టీడీపీ మంత్రులు, నేతలు చేసిన వ్యాఖ్యల వెనుక అర్థమేంటి? అని ఆమె ప్రశ్నించారు.

2897
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles