యాసిన్ మాలిక్ అరెస్టు.. క‌శ్మీర్‌కు బ‌ల‌గాల త‌ర‌లింపు

Sat,February 23, 2019 10:51 AM

Yasin Malik arrested, 100 columns of troops airlifted to Srinagar

శ్రీన‌గ‌ర్: జ‌మ్మూక‌శ్మీర్ వేర్పాటువాది యాసిన్ మాలిక్‌ను.. గత రాత్రి అరెస్టు చేశారు. శ్రీన‌గ‌ర్‌లో అత‌న్ని అదుపులోకి తీసుకున్నారు. ఆర్టిక‌ల్ 35ఏపై సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వ‌నున్న నేప‌థ్యంలో పోలీసులు ముంద‌స్తుగా అత‌న్ని ఆధీనంలోకి తీసుకున్నారు. సోమ‌వారం సుప్రీంకోర్టు ఈ తీర్పును వెలువ‌రించే అవ‌కాశాలు ఉన్నాయి. మ‌రో వైపు క‌శ్మీర్‌కు భారీ సంఖ్య‌లో పారామిలిట‌రీ బ‌ల‌గాలు చేరుకుంటున్నాయి. వంద కంపెనీల అద‌న‌పు బ‌ల‌గాల‌ను అక్క‌డికి పంపారు. పుల్వామా దాడి త‌ర్వాత క‌శ్మీర్‌లో క్ర‌మ‌బ‌ద్ధంగా భ‌ద్ర‌తను పెంచుతున్నారు. వేర్పాటువాదుల‌ను అదుపులోకి తీసుకుంటున్న నేప‌థ్యంలోనూ అక్క‌డ భ‌ద్ర‌త‌ను మ‌రింత పెంచేశారు. జ‌మాతే ఇస్లామి వేర్పాటువాది అబ్దుల్ హ‌మిద్ ఫ‌యాజ్‌ను కూడా అరెస్టు చేశారు.

2964
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles