ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే యమరాజా మీ ఇంటికొస్తాడు జాగ్రత్త..!

Wed,July 11, 2018 05:40 PM

Yamaraja helps Bengaluru traffic police in safe drive campaign

బెంగళూరు: దేశవ్యాప్తంగా ప్రతిరోజు ఎంతోమంది వాహనదారులు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా ద్విచక్రవాహనదారులు హెల్మెట్ ధరించకపోవడంతో మరణాల రేటు ఎక్కువగా ఉందని సర్వేలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో హెల్మెట్ ధరించడంపై అవగాహన కల్పించడానికి బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు.

బెంగళూరులోని టౌన్‌హాల్ సమీపంలో యమధర్మరాజు వేషంలో ఓ వ్యక్తి సిగ్నల్స్ దగ్గర నిలబడి హెల్మెట్ల ప్రాముఖ్యంపై అవగాహన కల్పించారు. హెల్మెట్ ధరించని, ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన, అతివేగంగా వాహనాలను నడిపిన వారి ఇంటికి.. లార్డ్ యమరాజా మీ ఇంటికొస్తాడు జాగ్రత్తా అనే సందేశాన్ని వాహనదారులకు తెలిసేలా చేశారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించడంలో భాగంగా రహదారి భద్రతపై కూడా అవగాహన కల్పించారు. హెల్మెట్ లేకుండా వెళ్తున్న వారిని ఆపి వారికి పూల మొక్కలను బహుకరించారు. సినీ ఆర్టిస్ట్ వీరేశ్‌తో పోలీసులు యమధర్మరాజు వేషం వేయించి అతడిని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకొని ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. పోలీసుల వినూత్న ప్ర‌యోగంపై సోష‌ల్‌మీడియాలో ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.2515
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles