రూ.1.36 లక్షల యమహా బైక్‌ను చూడండి...

Sat,March 16, 2019 06:22 AM

Yamaha MT 15 Launched In India At Rs 1.36 lakh

న్యూఢిల్లీ : ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ యమహా మోటర్..దేశీయ మార్కెట్లోకి 155 సీసీ సామర్థ్యం కలిగిన ఎంటీ-15 బైకును విడుదల చేసింది. ఈ బైకు ధరను రూ.1.36 లక్షలుగా నిర్ణయించింది. ఈ ధరలు ఢిల్లీ షోరూంకు సంబంధించినవి. లిక్విడ్-కూల్ ఫోర్-స్ట్రోక్ ఇంజిన్ కలిగిన ఈ బైకులో ఆరు గేర్లు ఉన్నాయి. వీటితోపాటు సింగిల్ చానెల్ యాంటి-లాక్ బ్రేకింగ్ సిస్టమ్(ఏబీఎస్), ప్యూయల్ ఇంజెక్ట్‌డ్ వేరిబుల్ వాల్యు యాక్టేషన్(వీబీఏ) వంటి ఫీచర్స్ ఉన్నాయి. ప్రస్తుతం భారత్‌లో మోటార్‌సైకిల్ విభాగంలో నూతనశకం ఆరంభమైందని, డ్రైవర్లకు నూతన అనుభవం కోరుకుంటున్నారని, ముఖ్యంగా వేగం, కంట్రోల్ చేయగల సామర్థ్యం కలిగినదే ఈ ఎంటీ-15 బైకని యమహా మోటర్ ఇండియా చైర్మన్ మోటోఫూమి శిటారా తెలిపారు. ఇప్పటికే సంస్థ ఎంటీ-09 మోడల్‌ను 2015 నుంచి విక్రయిస్తున్నది.

1575
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles