తొమ్మిదేళ్లు ఎన్నో కష్టాలను అనుభవించాం..ఒక్కసారి అవకాశం ఇవ్వండి.!

Mon,March 11, 2019 04:50 PM

Y S Jagan Mohan Reddy Speech in Kakinada Meeting

కాకినాడ: వైఎస్‌ఆర్‌సీపీని స్థాపించి రేపటికి తొమ్మిదేళ్లు.. ఈ 9ఏళ్లు ఎన్నో కష్టాలను అనుభవించామని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తెలిపారు. కాకినాడలో వైఎస్‌ఆర్‌సీపీ సమరశంఖారావం సభలో జగన్ ప్రసంగించారు. జగన్ మాట్లాడుతూ.. అవినీతిలేని స్వచ్ఛమైన పాలన అందించడమే నా లక్ష్యం. సంక్షేమ పథకాలు ప్రతీ ఒక్కరికి అందాలి. మిమ్మల్ని అన్ని విధాలుగా ఆదుకుంటా. వైసీపీకి ఒక్కసారి అవకాశం ఇవ్వండి. ఎన్నికలు రాగానే చంద్రబాబుకు ప్రజలు గుర్తుకొచ్చారు. టీడీపీ ప్రభుత్వ మోసాలపై ప్రతీ ఇంట్లో చర్చ జరగాలి. చంద్రబాబు పార్టీ మాదిరి వైసీపీ ఉండదు. టీడీపీకి బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది. నాలుగేళ్లు బీజేపీతో ఉండి రాష్ట్ర ప్రయోజనాలను గండికొట్టారు.

ప్రత్యేక హోదాను టీడీపీ తాకట్టు పెట్టింది. రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి జరుగుతోంది. చివరికి దేవుడి భూములను కూడా టీడీపీ నేతలు వదిలి పెట్టలేదు. రాజధానిలో టెంపరరీ బిల్డింగ్‌లు తప్పా.. పర్మినెంట్ ఏదీ కన్పించదు. నిరుద్యోగ భృతి పేరుతో యువతను దగా చేశారు. మోసాలు చేయడంలో చంద్రబాబు పీహెచ్‌డీ చేశారు. చంద్రబాబు ఆయన బినామీలకే రాయితీలు, టెండర్లు ఇస్తున్నారు. ఎన్నికల వేళ సినిమాల పేరుతో చంద్రబాబు చేస్తున్న డ్రామాలపై చర్చ జరగాలని జగన్ కోరారు.

3489
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles