ప్రముఖ రచయిత ఎం.ఎం.కల్బుర్గి కాల్చివేత

Sun,August 30, 2015 04:32 PM

Writer MM Kalburi shot dead

హైదరాబాద్: కర్ణాటకకు చెందిన ప్రముఖ రచయిత, చరిత్రకారుడు మల్లేషప్ప మాదివలప్ప కల్బుర్గిని గుర్తు తెలియని దుండగులు తుపాకితో కాల్చి చంపారు. ఇవాళ ఉదయం ధార్వాడ్‌లోని తన నివాసంలో ఉండగా బైకుపై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని దుండగులు కల్బుర్గిపై కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఆయనను ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతిచెందారు. కాల్పులు జరిపిన అనంతరం దుండగులు అక్కడ నుంచి పారిపోయారు. కల్బుర్గి గతంలో హంపీలోని కన్నడ యూనివర్సిటీ వీసీగా పనిచేశారు. 2009లో ఆయన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నారు. నృపతుంగ, పంపా అవార్డులను కూడా అందుకున్నారు. కల్బురి బీజాపూర్ జిల్లాలోని యారగల్ గ్రామంలో 1938లో జన్మించారు.

2781
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS