ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం.. ఎక్కడో తెలుసా?

Wed,January 9, 2019 02:51 PM

Worlds Largest cricket stadium to built in Ahmedabad

అహ్మదాబాద్: ప్రస్తుతం ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ గ్రౌండ్ ఆస్ట్రేలియాలో ఉన్న సంగతి తెలుసు కదా. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌దే ఈ ఘనత. అయితే ఇప్పుడా ఎంసీజీని తలదన్నే స్టేడియంలో ఇండియాలోనే సిద్ధమవుతున్నది. ఇదెక్కడో కాదు.. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో. ఇప్పుడున్న మొతెరా స్టేడియాన్నే పూర్తిగా మార్చేసి ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియంగా రూపుదిద్దనున్నట్లు గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు పరిమల్ నథ్వానీ వెల్లడించారు. నిర్మాణంలో ఉన్న ఈ స్టేడియం ఫొటోలను కూడా తొలిసారి విడుదల చేశారు. ఎంసీజీ కంటే ఈ స్టేడియం పెద్దగా ఉంటుందని ఆయన చెప్పారు. ఈ స్టేడియం నిర్మాణం పూర్తయితే ఇది దేశ ప్రతిష్ఠను ఇనుమడిస్తుందని అన్నారు.


2011 డిసెంబర్ వరకు ఈ మొతెరా స్టేడియంలో 23 వన్డే మ్యాచ్‌లకు వేదికైంది. క్రికెట్‌లో కొన్ని చారిత్రక సంఘటనలను కూడా ఈ స్టేడియం వేదికైంది. టెస్టుల్లో తొలిసారి పది వేల పరుగుల మైలురాయిని లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ ఇక్కడే అందుకున్నాడు. ఇక ఇదే స్టేడియంలో సచిన్ టెండూల్కర్ టెస్టుల్లో తన తొలి డబుల్ సెంచరీని న్యూజిలాండ్‌పై సాధించాడు. 1982లో ఈ స్టేడియాన్ని నిర్మించగా.. సీటింగ్ కెపాసిటీ 49 వేలుగా ఉంది. 1983లో తొలిసారి ఇండియా, వెస్టిండీస్ టెస్ట్ మ్యాచ్‌కు వేదికైంది. అదే 1853లో కట్టిన ఎంసీజీ సామర్థ్యం 90 వేలుగా ఉంది. ఇప్పుడా రికార్డును మొతెరా బీట్ చేయాలని చూస్తున్నది.

4696
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles