మ‌న ఆర్మీ గురించి ప్రపంచం మాట్లాడుకుంటోంది : మోదీ

Tue,October 18, 2016 01:30 PM

World is talking about our army now, says PM Modi

మండి : ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ మ‌రోసారి భార‌త ఆర్మీపై ప్ర‌శంస‌లు కురిపించారు. ఇవాళ హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో జ‌రిగిన స‌భ‌లో మాట్లాడుతూ స‌ర్జిక‌ల్ దాడులు నిర్వ‌హించిన భార‌త ఆర్మీని కీర్తించారు. ప్ర‌పంచం అంతా ఇప్పుడు మ‌న సైన్యం గురించి మాట్లాడుకుంటోంద‌న్నారు. రాష్ట్ర రాజ‌ధాని షిమ్లాకు 160 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న మండిలో జ‌రిగిన స‌భ‌లో ఆయ‌న మాట్లాడారు. గ‌తంలో ఇజ్రాయిల్ ఆర్మీ గురించి ప్ర‌పంచ‌దేశాలు మాట్లాడుకునేవ‌ని, ఇప్పుడు మ‌న ఆర్మీ కూడా అలాంటి దాడులు చేయ‌గ‌ల‌దని, వాళ్ల సామ‌ర్థ్యాన్ని త‌క్కువ‌గా అంచ‌నా వేయ‌లేమ‌న్నారు. సెప్టెంబ‌ర్ 29న భార‌త ఆర్మీ ద‌ళాలు నియంత్ర‌ణ రేఖ దాటి పాక్ ఆక్ర‌మిత్ క‌శ్మీర్‌లో స‌ర్జిక‌ల్ దాడులు చేసి ఉగ్ర‌వాదుల‌ను మ‌ట్టుబెట్టిన విష‌యం తెలిసిందే.

1423
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles