మొదటి చెత్త ట్రక్కు డ్రైవర్‌గా..

Tue,January 26, 2016 09:49 PM

women truck driver

చిన్న వయసులో పెళ్లి.. భర్త తాగుబోతు. ముప్పై ఏళ్ల జీవితం గడిచిపోయింది. మళ్లీ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంది. అదెలా అంటారా? బెంగళూరుకు చెందిన లక్ష్మి మొదటి మహిళా చెత్త ట్రక్కు డ్రైవర్‌గా ఎంపికయింది. కెంపెగౌడ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్‌లో హౌస్ కీపింగ్ విభాగంలో పనిచేస్తున్న లక్ష్మికి బెంగళూరు నగరంనే మొదటి చెత్త ట్రక్కు డ్రైవర్‌గా త్వరలో విధుల్లోకి హాజరవనుంది.

హసిరు దలా సంస్థ సహకారంతో లక్ష్మి డ్రైవింగ్ స్కూల్‌లో జాయిన్ అయి డిసెంబర్ నెలలో డ్రైవింగ్ నేర్చుకుంది. పేదరికం వల్ల లక్ష్మి కూతురు స్కూల్ మానేసి టైలరింగ్ పని చేస్తుంది. ఇద్దరూ బాబులు ప్రభుత్వ హాస్టళ్లో ఉంటూ చదువుకుంటున్నారు. బెంగళూరులో చెత్త ఎత్తే సంస్థ హసిరు దలా వాహనంతో ఇంటింటికి తిరిగి చెత్త సేకరించనుంది.

ప్రస్తుతం హెవీ వెహికిల్ డ్రైవింగ్ ట్రైనింగ్‌లో ఉన్నది. పేదరికం, కుటుంబ బాధ్యతలు, రోజువారీ పని ఇవే కాకుండా నిత్యం ఏదైనా నేర్చుకోవాలనే తపన లక్ష్మికి ఉంది. అందుకే ఇంగ్లీష్ మాట్లాడటం, చదవడం నేర్చుకోగలిగింది. ఇప్పుడు వార్తల్లోకెక్కింది.

1575
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles