ఆస్పత్రిలో అత్యాచారం..నిందితుడి అరెస్ట్‌

Tue,May 14, 2019 05:59 PM

women raped in hospital accused arrested by mumbai police


ముంబై: ముంబైలోని ఆస్పత్రిలో ఓ మహిళపై అత్యాచారానికి ఒడిగట్టిన దుండగుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. 37 ఏళ్ల మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన సోదరి కోసం సహాయకురాలిగా వచ్చింది. దుండగుడు ఆస్పత్రిలో ఓ ఫారం నింపే విషయంలో సాయం చేస్తానని నమ్మించి ఆ మహిళను ఐదో అంతస్థుపైకి తీసుకెళ్లి..ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధిత మహిళ తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చేరింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రిలోని సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడు దీపక్‌ అన్నప్పను పట్టుకున్నారు. ఈ ఘటనపై ఐపీసీ సెక్షన్‌ 376 కింద కేసు నమోదు చేసిన సియోన్‌ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

5478
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles