రైళ్లలో ఇలాంటి వేధింపులు కూడా జరుగుతాయా? వీడియో

Thu,January 3, 2019 05:20 PM

Women pass holders bully other ticket holders for seats in Surat Mumbai intercity express

రైళ్లలో ప్రయాణం అంటేనే దడుసుకునే ప‌రిస్థితి వ‌స్తోంది రోజురోజుకూ. రైళ్లలో బాత్‌రూంలలో అపరిశుభ్రత, సెక్యూరిటీ ఉండదు, సరిగ్గా నీళ్లు రావు.. ఇలా చెప్పుకుంటూ పోతే.. రైలు ప్రయాణికులకు ఎదురయ్యే సమస్యలు బోలెడు. అయితే.. రైళ్లలో ఇప్పుడు కొత్తరకం వేధింపులు ప్రారంభమయ్యాయి. అది కూడా మహిళలే మహిళలను వేధిస్తున్నారు. ఇటువంటి ఘటనలు ఎక్కువగా ముంబై - సూరత్ మధ్య నడిచే రైళ్లలో జరుగుతున్నాయట.

లేడీస్ కంపార్ట్‌మెంట్లలో ప్రయాణించే మహిళలకు.. నెలవారి పాసులు ఉన్న మహిళలు, యువతులు చుక్కలు చూపిస్తున్నారు. ఇటువంటి ఘటన ఒకటి సూరత్-ముంబై ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లో చోటు చేసుకున్నది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పాసులు ఉన్న మహిళలు.. సీట్లలో కూర్చున్న మహిళలను నిర్దాక్షిణ్యంగా సీట్లలో నుంచి లేపి మరీ కూర్చుంటున్నారట. ముందుగా తాము కుర్చున్నామని చెప్పినా వినకుండా.. తాము నెలవారి పాస్ హోల్డర్లమని.. తాము రోజూ ఇదే ట్రెయిన్‌లో ప్రయాణిస్తామని.. బెదిరిస్తూ సీట్లు లాక్కొని కూర్చుంటున్నారట. మరికొంతమందైతే.. ఏం చక్కా నిద్రపోతున్నారట. మిగితా ప్యాసెంజర్లను నిలబెట్టి మరీ వాళ్లు నిద్రపోవడం, సీటుకు ఒకరు, ఇద్దరు కూర్చోవడం వీడియోలో రికార్డయింది. చిన్నపిల్లలు ఉన్నా కూడా కనికరించకుండా వాళ్లను లేపుతున్నారు. దీంతో చిన్నపిల్లల తల్లులు డోర్ దగ్గర కూర్చోవాల్సి వస్తోంది. దీనిపై ఇప్పటి వరకు ఏ రైల్వే అధికారి గానీ.. రైల్వే పోలీసులు కానీ స్పందించలేదట. ఇది రోజూ జరిగే తతంగమయినా.. రైల్వే అధికారులకు తెలిసినా నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నారంటూ ప్రయాణికులు వాపోతున్నారు.


(Video courtesy: The Times of India)

8536
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles