మహిళా మంత్రులు.. శాఖలు ఇవే..

Fri,May 31, 2019 02:48 PM

women ministers gets portfolios in Modi cabinet

హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్‌లో ఆరుగురు మహిళలకు చోటు దక్కింది. ఇందులో ముగ్గురు కేంద్ర మంత్రులుగా కాగా, మరో ముగ్గురు సహాయ మంత్రులు. నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ, హర్‌సిమ్రత్ కౌర్ బాదల్.. కేంద్రమంత్రులుగా ప్రమాణం చేశారు. సాధ్వి నిరంజన్ జ్యోతి, రేణుకా సింగ్ సరుతా, దేబోశ్రీ చౌదరి సహాయ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ, హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ గత ప్రభుత్వ హయాంలో కూడా కేంద్ర మంత్రులుగా పని చేశారు. రేణుకా సింగ్ సరుతా, దేబోశ్రీ చౌదరి కొత్తవారు, కాగా సాధ్వి నిరంజన్ జ్యోతి గత ప్రభుత్వంలో సహాయ మంత్రిగా సేవలందించారు. గత ప్రభుత్వంలో ఏడుగురు మహిళలు కేంద్ర మంత్రులుగా పని చేశారు.

నిర్మలా సీతారామన్ - ఆర్థిక శాఖ, కార్పొరేట్ వ్యవహారాల శాఖ
స్మృతి ఇరానీ - మహిళా, శిశు సంక్షేమం, జౌళి శాఖ
హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ - ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ శాఖ

సాధ్వి నిరంజన్ జ్యోతి - గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి
రేణుకా సింగ్ సరుతా - గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి
దేబోశ్రీ చౌదరి - మహిళా, శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రి

2596
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles