ఆ పేలుడు పదార్థాలు మోసుకెళ్లింది మహిళలు, చిన్నారులు!

Wed,February 20, 2019 03:28 PM

న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడికి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ దాడిలో వాడిన పేలుడు పదార్థాలను మహిళలు, చిన్నారుల సాయంతో ఒక చోటు నుంచి మరో చోటుకి తరలించినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. కొన్ని నెలల పాటు ఈ పేలుడు పదార్థాలను పాకిస్థాన్ నుంచి సరిహద్దు దాటిస్తూ వచ్చారని తెలిపాయి. ఆ తర్వాత బాంబు తయారీ మాత్రం పూర్తిగా ఇండియాలోనే జరిగింది. ఈ దాడిలో వాడిన ఆర్డీఎక్స్ మిలిటరీ ఏ5 గ్రేడ్ కేటగిరీకి చెందినదిగా గుర్తించారు. చిన్న చిన్న మొత్తాల్లో ఈ ఆర్డీఎక్స్‌ను కొన్ని నెలల పాటు మహిళలు, పిల్లల సాయంతో తరలించినట్లు నిఘా వర్గాలు చెప్పాయి. ఈ మొత్తం పేలుడు పదార్థాలను పుల్వామాకు చేర్చారు. ఆర్డీఎక్స్ చాలా ప్రమాదకరమైన పేలుడు పదార్థం. దీనిని సాధారణంగా మైనం లేదా సబ్బులో పెట్టి తరలిస్తారు. ఈ మిలిటరీ గ్రేడ్ ఆర్డీఎక్స్‌ను ఆక్టాడెకానాయిక్ యాసిడ్‌తో కలుపుతారు.


ఈ ఏ5 గ్రేడ్ ఆర్డీఎక్స్ 99.5 శాతం శుద్ధమైనదిగా చెబుతారు. పైగా చాలా చాలా ఖరీదైనది. పుల్వామా దాడిలో ఇదే ఆర్డీఎక్స్‌ను సుమారు 300 కిలోల మేర ఉపయోగించారు. పేలుడు తీవ్రత పెంచడానికి ఈ ఆర్డీఎక్స్‌లో మేకులు, ఇనుప ముక్కలు, అల్యూమినియం నైట్రేట్ జత చేశారు. మూడు డ్రమ్ముల్లో దీనిని నింపి వెహికిల్‌లో తీసుకెళ్లి సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడి చేశారు. మిలిటరీ గ్రేడ్ పేలుడు పదార్థాలను బట్టి జైషే మహ్మద్‌కు కచ్చితంగా పాకిస్థాన్ ఆర్మీ మద్దతు ఉన్నట్లు నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. వీటిని పాకిస్థాన్‌లో రావల్పిండిలో అక్కడి ఆర్మీ సేకరించి.. ఉగ్రవాదులకు ఇచ్చినట్లు భారత నిఘా వర్గాలు వెల్లడించాయి.

7028
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles