మహిళను కాల్చిచంపిన ఉగ్రవాదులు

Wed,June 5, 2019 11:25 AM

Woman shot dead by terrorists in Jammu and Kashmir Pulwama

శ్రీనగర్ : జమ్మూకశ్మీర్ పుల్వామా జిల్లాలోని కాకపోరాలో ఉగ్రవాదులు దుశ్చర్యకు పాల్పడ్డారు. ఇంట్లో ఉన్న ఓ మహిళపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో మరో యువకుడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. వీరిద్దరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా.. మహిళ ప్రాణాలు కోల్పోయింది. యువకుడు పరిస్థితి విషమంగా ఉంది. మృతి చెందిన మహిళను నైజీనా బానో, యువకుడిని మహ్మద్ సుల్తాన్‌గా పోలీసులు గుర్తించారు. ఉగ్రవాదుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మహిళపై కాల్పులు ఎందుకు జరిపారు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.2087
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles