ముగ్గురి ప్రాణాలు తీసిన కుటుంబ వివాదం

Thu,May 30, 2019 05:12 PM

Woman kills 2 children, self after consuming poison


ముజఫర్‌నగర్ : ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న ఘటన ముజఫర్‌నగర్ జిల్లాలో జరిగింది. షామిలీ జిల్లాలోని జమాల్ పూర్ గ్రామంలో 36ఏళ్ల రచన అనే మహిళ కూల్‌డ్రింక్‌లో విషం కలిపి పిల్లలకు ఇచ్చిన తర్వాత తను కూడా సేవించింది. ఈ ఘటనలో రచన, ఇద్దరు పిల్లలు మాన్సి (10), విక్రాంత్ (8) ప్రాణాలు కోల్పోయారు. కుటుంబం వివాదం కారణంగానే మహిళ తన పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడినట్లుగా ప్రాథమికంగా భావిస్తున్నామని ఎస్‌హెచ్‌వో నెమి చంద్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిసున్నట్లు చెప్పారు.

745
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles