మహిళను ఆటో డ్రైవర్ అడవిలోకి ఎత్తుకెళ్లి..

Wed,August 1, 2018 03:36 PM

Woman kidnapped raped by rickshaw driver in Thane

థానే: థానే జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. ఓ ఆటో రిక్షా డ్రైవర్ మహిళపై అత్యాచారానికి పాల్పడిన ఘటన థానే జిల్లాలోని ఉల్కాస్‌నగర్‌లో జరిగింది. రైటే గ్రామానికి చెందిన 25 ఏళ్ల వివాహిత, నెవాలీకి చెందిన ముఖేశ్ ఒకరికొకరు తెలుసు. నిన్న ఉదయం సదరు మహిళ ఉల్కాస్ నగర్‌లోని జువ్యెలరీ షాపుకు వెళ్తుంది. అదే సమయంలో ముఖేశ్ ఆటోలో ఆమె దగ్గరకు వచ్చాడు. పార్టీ పేరుతో ముఖేశ్ ఆ మహిళను హోటల్‌కు తీసుకెళ్లాడు. ఇద్దరూ హోటల్‌కు వెళ్లారు.

హోటల్‌లో తనను ఆహారం, కూల్‌డ్రింక్స్ తీసుకోవాలని బలవంతం చేయెద్దని మహిళ ముఖేశ్‌ను కోరింది. హోటల్ నుంచి బయటకి వచ్చాక తనతోపాటు షిర్డీ పట్టణానికి రావాలని ముఖేశ్ ఆ మహిళను అడుగగా..ఆమె నో చెప్పింది. ఆ తర్వాత ముఖేశ్ ఆ మహిళను ఇంటిదగ్గర దింపుతానని నమ్మించి ఆటో ఎక్కించుకున్నాడు. సపేగావ్ ప్రాంతంలోని అటవీ ప్రాంతంలోకి దారిమళ్లించి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు.

ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని ముఖేశ్ ఆమెను బెదిరించాడు. ఇంటికెళ్లిన తర్వాత బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు ముఖేశ్‌పై ఐపీసీ సెక్షన్ 363 (కిడ్నాప్), 376 (అత్యాచారం), 504 ల కింద కేసు నమోదు చేశారు. ముఖేశ్‌ను పట్టుకుంటామని పోలీస్ అధికారి ఒకరు తెలిపారు.

4686
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS