శ‌బ‌రిమ‌ల‌లో మ‌హిళా జ‌ర్న‌లిస్టు.. భ‌క్తులు ఆగ్ర‌హం

Thu,October 18, 2018 09:40 AM

woman journalit Suhasini stopped at Pamba who planned to visit Sabarimala


పంబ : శ‌బ‌రిమ‌ల స‌న్నిధానంకు బ‌య‌లుదేరిన ఓ మ‌హిళా జ‌ర్న‌లిస్టును అడ్డుకున్నారు. న్యూయార్క్‌ టైమ్స్ ప‌త్రిక కోసం ఢిల్లీలో ప‌నిచేసే జ‌ర్న‌లిస్టు సుహాసిని రాజ్‌.. శ‌బ‌రిమ‌ల ఆల‌యంలోకి ప్ర‌వేశించేందుకు ప్ర‌య‌త్నించింది. అయితే ఆమెను అయ్య‌ప్ప భ‌క్తులు అడ్డుకున్నారు. పంబ దాటి స‌న్నిధానం వైపు వెళ్తున్న జ‌ర్న‌లిస్టు సుహాసినికి పోలీసులు బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. కొంత దూరం వ‌ర‌కు ఆమె వెంట న‌డిచారు. కానీ మ‌ధ్య‌లో తీవ్ర ప్ర‌తిఘ‌ట‌న ఎదురైంది. భ‌క్తులు ఆ మ‌హిళ జ‌ర్న‌లిస్టుపై తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు. దీంతో స‌న్నిధాన యాత్ర‌ను అమె విర‌మించుకున్న‌ది. జ‌ర్న‌లిస్టు సుహాసినితో పాటు ఆమె విదేశీ మిత్రుడిని పోలీసులు పంబా పోలీసు స్టేష‌న్‌కు త‌ర‌లించారు. తాను అయ్య‌ప్ప ద‌ర్శ‌నం కోసం రాలేదు అని, కేవ‌లం రిపోర్టింగ్ చేసేందుకు వ‌చ్చిన‌ట్లు ఆమె చెప్పారు. ఇవాళ కేరళ రాష్ట్ర‌వ్యాప్తంగా బంద్ పాటిస్తున్నారు. అన్ని వ‌య‌సుల మ‌హిళ‌ల‌కు శ‌బ‌రిమ‌ల ప్ర‌వేశాన్ని క‌ల్పిస్తూ సుప్రీం ఇచ్చిన తీర్పుకు వ్య‌తిరేకంగా కేర‌ళ‌లో బంద్ నిర్వ‌హిస్తున్నారు.

573
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles