పాము కాటేసిందని.. దానిని బందీగా చేసుకుంది!

Wed,July 25, 2018 04:42 PM

Woman held snake captive after it bites her

రాంచీ: పామును చూడగానే మనం వణికిపోతాం. పాము కాటేస్తే వెంటనే ఆసుపత్రికి పరుగెత్తుతాం. కానీ జార్ఖండ్‌లోని మనితా దేవి అనే మహిళ మాత్రం తనను కాటేసిన పామును పట్టుకుంది. దాన్ని ఓ పాత్రలో వేసి బంధించింది. ఆ తర్వాత దానిని పట్టుకొని రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)కు వెళ్లడంతో అక్కడి డాక్టర్లు షాక్ తిన్నారు. సదరు మహిళకు ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్లు చెబితేనే ఆ పామును వదిలేస్తామని మనితా వెంట వచ్చిన బంధువులు చెప్పడం విశేషం. బుధవారమే రిమ్స్‌కు ఇలా నలుగురు పాము కాటుకు గురైన పేషెంట్లు వచ్చినట్లు అక్కడి డాక్టర్లు చెప్పారు. అయితే ఎలాంటి పాము కాటు వేసినా దానికి సరిపడా మందులు తమ దగ్గర ఉన్నాయని వాళ్లు తెలిపారు. మనితా దేవికి కూడా చికిత్స చేసి ప్రమాదమేమీ లేదని తేల్చారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు దానిని వదిలిపెట్టారు.

4399
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles